- Advertisement -
హైదరాబాద్ : విద్యుత్ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ ఓబెన్ ఎలక్ట్రిక్ 24/7 కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. గత మూడు నెలల్లో 90 శాతం సర్వీస్ కేసులు 72 గంటల్లో పరిష్కరించబడ్డాయని ఓబెన్ ఎలక్ట్రిక్ సీఈఓ మధుమిత అగర్వాల్ తెలిపారు. ప్రతి కస్టమర్‌కు ఓబెన్ కేర్ సర్వీస్ సెంటర్లు వేగవంతమైన, పారదర్శకమైన సపోర్ట్‌ను అందిస్తాయన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు 37 షోరూంలు ఉండగా.. వచ్చే మార్చి నాటికి 50 నగరాల్లో 150 అవుట్‌లెట్‌లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -