- Advertisement -
హైదరాబాద్ : దేశీయ విద్యుత్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ తన రోర్ ఇజడ్ మోడల్‌ను అమెజాన్ ఇండియాలో అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. డిజిటల్ అమ్మకాల విస్తరణలో భాగంగా జులై 15 నుంచి దీన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు ఓబెన్ ఎలక్ట్రిక్ ఫౌండర్ మధుమిత అగ్రవాల్ తెలిపారు. 3.4కిలోవాట్ బ్యాటరీ రోర్ ధరను రూ.1,19,999గా, 4.4 కిలోవాట్ రోర్ ధరను రూ.1,29,000గా నిర్ణయించామన్నారు. అసలు ధరపై రూ.20వేల తగ్గింపును ఇస్తున్నామన్నారు.
- Advertisement -