Saturday, December 13, 2025
E-PAPER
Homeఖమ్మంపంపిణీ కేంద్రాన్ని సందర్శించిన అబ్జర్వర్ సర్వేశ్వర రెడ్డి

పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన అబ్జర్వర్ సర్వేశ్వర రెడ్డి

- Advertisement -

పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు 
రేపే పోలింగ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

సాధారణ స్థానిక ఎన్నికలు – 2025 రెండో దఫా లో భాగంగా అశ్వారావుపేట మండలంలో రేపు జరగనున్న పోలింగ్‌ కు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ నిర్వహణకు నియమితులైన సిబ్బంది శనివారం తమ తమ పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ అప్పారావు పర్యవేక్షణలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి పోలింగ్ సిబ్బంది బస్సుల ద్వారా కేంద్రాలకు బయలుదేరారు.

మొత్తం మండలంలో 27 పంచాయితీలు,234 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, మద్దికొండ, రామన్నగూడెం పంచాయితీలు ఏకగ్రీవం కావడంతో నేడు 25 పంచాయితీలు, 220 వార్డులకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్‌ లో పురుష ఓటర్లు 14,538, మహిళా ఓటర్లు 15,327 మంది కలిపి మొత్తం 29,840 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్ నిర్వహణకు 220 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 660 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం మండలాన్ని 4 జోన్‌ లుగా, 8 రూట్లు గా విభజించడం తో పాటు 8 గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ నాగరాజు రెడ్డి,ఎస్సైలు యయాతి రాజు,కే.అఖిల లు తో పాటు 190 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.

పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని స్థానిక ఎన్నికల జిల్లా అబ్జర్వర్ సర్వేశ్వర రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహణ జరిగేలా ప్రతి సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వారు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -