నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వరద ఉధృతికి ఓసిపి అధికారులు అటవీప్రాంతంలో వేసిన మట్టిరోడ్డు తెగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురివుతున్నట్లుగా వాపోయారు. మండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురం ఓసిపి నుంచి భూపాలపల్లిలోని చెల్పూర్ కాకతీయ పవర్ ప్లాంట్ కు వేసిన బెల్టుపై బొగ్గు తరలించడానికి కాపురం నుంచి అటవీప్రాంతం మీదుగా చెల్పూర్ కు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఇటీవల గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి రోడ్డు తెగిపోయి గండి పండింది. ఈ రోడ్డుపై నుంచి నిత్యం వందలాది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు.రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురివుతున్నారు. వెంటనే గండిని పూడ్చాలని కోరుతున్నారు.
వరద ఉధృతితో ఓసిపి రోడ్డుకు గండి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES