Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓసీపీ నీరు పొలాలకు రాకుండా చూడాలి..

ఓసీపీ నీరు పొలాలకు రాకుండా చూడాలి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల కాపురం గ్రామ రెవెన్యూ శివారులోని పొలాల్లోకి ఓసిపి నీరు రాకుండా కాల్వకు మరమ్మతులు చేయాలని రైతులు లక్ష్మయ్య, మెగిళి, రమేశ్, రవి, చంద్రయ్య అధికారులను కోరారు. ఈ సందర్భంగా బుధవారం పొలాల వద్దకు చేరుతున్న ఓసిపి నీరును చూపిస్తూ మాట్లాడారు. అధిక వర్షాలు కురిసిన సమయంలో తాడిచర్ల ఓసిపి నీరు కాల్వ ప్రవాహం పెరిగి కాపురం శివారులోని తమ పంట పొలాల మీదుగా వెళ్తున్నాయని తెలిపారు. ఓసిపి నీరు చేరడంతో పొలాలు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు విన్న వించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాల్వలను సరి చేసి ఓసిపి నీళ్లు పొలాల మీదుగా వెళ్లకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad