Wednesday, November 26, 2025
E-PAPER
HomeNewsవన్డే ర్యాంకింగ్స్‌..రోహిత్ శ‌ర్మ స్థానం ప‌దిలం

వన్డే ర్యాంకింగ్స్‌..రోహిత్ శ‌ర్మ స్థానం ప‌దిలం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(781) వన్డే ర్యాంకింగ్స్‌(ICC ODI rankings)లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గత వారం టాప్‌లో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్(766) రెండో ర్యాంకుకు పడిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే చివరి రెండు వన్డేల్లో మిచెల్ ఆడకపోవడంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. కాగా నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీంట్లో రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. ఆ మ్యాచుల్లో రాణిస్తే హిట్‌మ్యాన్(Rohit Sharma) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాడు. అఫ్గానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -