- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలో భక్తులు పోచమ్మ మైసమ్మ బోనాలు సమర్పించారు. ఆదివారం డప్పు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలు, బాణాసంచా పేలులతో, పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా బోనాల నేర్చుకుని దేవాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. హనుమాన్ వాడలో పోచమ్మ, బంగారు మైసమ్మలకు బోనాలు సమర్పించారు. ఎల్బీనగర్, సమాద్ చౌరస్తా, శ్రీరామ్ నగర్, ఆర్.బి నగర్, జంకానగూడ గాంధీనగర్, పోచమ్మ దేవాలయాలలో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి, వడీబియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో కొలుపుల వివేకానంద ,తుపాకుల శ్రీను, నీల శ్రీను, ముల్కల సత్యనారాయణ, పెంట నరసింహ, సాధు విజయకుమార్, కొలుపుల కమలాకర్ ఎనబోయిన జహంగీర్ కొలుపుల నాగరాజు, పాల్గొన్నారు.
- Advertisement -