Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఎంపీటీసీ ల ఓటర్లు జాబితా ప్రకటించిన అధికారులు..

ఎంపీటీసీ ల ఓటర్లు జాబితా ప్రకటించిన అధికారులు..

- Advertisement -
  • అశ్వారావుపేట నియోజక వర్గంలో..
    – ఎంపీటీసీ సెగ్మెంట్ లు 52,
    – పోలింగ్ కేంద్రాలు 272
    – ఓటర్లు జాబితాలను ప్రకటించిన ఎంపీడీఓ లు
    నవతెలంగాణ-అశ్వారావుపేట
  • స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ చివరినాటికి జరిపించాలనే కోర్ట్ ఆదేశాలు మేరకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై దృష్టి సారించింది. ముందుగా ఎంపీటీసీలు,జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ జిల్లా అధికారులకు రూపొందించిన ఓటర్లు జాబితా ప్రకటించడం, రాజకీయ పార్టీల అభ్యంతరాలు స్వీకరించడం, తుది జాబితా రూపొందించే విధంగా ఈ నెల 6 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు కార్యాచరణకు ఆదేశించడంతో నియోజక వర్గంలోని 5 మండలాలకు చెందిన ఎంపీటీసీ ల వారీ ఓటర్లు జాబితాలను గురువారం ఆయా కార్యాలయాల్లో ప్రదర్శించారు.
  • అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండలాల ఎంపీడీఓ లు అప్పారావు, రవీంద్రారెడ్డి, రామారావు, మహాలక్ష్మి, అశోక్ లు తెలిపిన వివరాలు ప్రకారం.. నియోజక వర్గం 5 మండలాల్లో 52 ఎంపీటీసీ లు,5 జెడ్పీటీసీలు,272 పోలింగ్  కేంద్రాలు గా రూపొందించారు. మొత్తం 1,44,403 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు తెలిపారు.

అశ్వారావుపేటలో…
ఎంపీటీసీ లు : 11
పోలింగ్ కేంద్రాలు : 60
పురుషులు : 14,923
స్త్రీలు : 15,766, 
ఇతరులు: 02, 
మొత్తం : 30,691

దమ్మపేట లో…
ఎంపీటీసీలు : 17, 
పోలింగ్ కేంద్రాలు : 87, 
పురుషులు : 21,290,
స్త్రీలు : 23256, 
మొత్తం: 44,546.

ములకలపల్లి లో…
ఎంపీటీసీ లు 10, 
పోలింగ్ కేంద్రాలు: 53, 
పురుషులు : 13,856, 
స్త్రీలు: 14,493
మొత్తం: 28,379.

అన్నపురెడ్డిపల్లి లో…..
ఎంపీటీసీ లు : 6, 
పోలింగ్ కేంద్రాలు : 32, 
పురుషులు : 8,363, స్త్రీలు: 8,569, 
ఇతరులు : లేరు..
మొత్తం : 16,932.

చండ్రుగొండ లో..
ఎంపీటీసీ లు: 8, 
పోలింగ్ కేంద్రాలు : 40, 
పురుషులు : 11,640,
స్త్రీలు : 12,214, 
ఇతరులు : 01
మొత్తం : 23,855.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad