Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు కరువు వేలవేల బోయిన కుర్చీలు

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు కరువు వేలవేల బోయిన కుర్చీలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం మద్నూర్ మండల కేంద్రంలో అధికారుల కరువుతో వెల వేల బోయిన కాలి కుర్చీలు. సోమవారం నాడు తాసిల్దార్ అధ్యక్షతన తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తాసిల్దార్ తో పాటు మద్నూర్ ఎంపీడీవో రాణి, మద్నూర్ మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య మాత్రమే హాజరుగా ఉన్నారు. మిగతా శాఖల అధికారులు హాజరు కాలేకపోవడం ప్రజావాణి కార్యక్రమం వేలవేల పోయింది. నవ తెలంగాణ సోమవారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సందర్శించగా తాసిల్దార్ తో పాటు మరో ఇద్దరు అధికారులు మాత్రమే హాజరుగా కనిపించారు. మిగతా శాఖల అధికారులు ఏమయ్యారు. అంటే వాళ్లు రాలేకపోయారనే మాట తాసిల్దార్ తెలిపారు. అధికారులు లేకుండా ప్రజావాణి ఎలా విజయవంతం అవుతుంది. అని తాసిల్దారును అడగగా గైరాజరయ్యే అధికారులపై ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. మద్నూర్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు కరువుగానే ఉంటున్నారు. గైరాజరయ్యే అధికారులపై సంబంధిత శాఖలో ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad