నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌లోని వడోదర సమీపంలోని మహిసాగర్ నదిపై ఉన్న వంతెన జులై 9న కూలిపోవడంతో మోడీ పాలన పైనా పటారం లోన లోటరం అని తెలిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోయాయి. ఒక ట్యాంకర్ వంతెనపై ఇరుక్కుపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే ఆ ప్రమాద సమయంలో వంతెనపై పడిపోయిలో స్థితిలో ఉన్నా లారీ అప్పట్నుంచి అలాగే ఉంది.
ఈ తాజాగా ఇవాళ ఆ లారీని తొలగించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కలెక్టర్ ప్రవీన్ కుమార్ దగ్గర ఉండి తొలగింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ట్రక్కును రక్షించడం కష్టంగా ఉంది, ట్రక్కు రెస్క్యూ ఆపరేషన్‌ను పోర్బందర్‌లోని విశ్వకర్మ గ్రూప్ నిర్వహిస్తోందని, ట్రక్కును రక్షించే సెటప్ దాదాపు పూర్తయిందని, అధికారులు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ప్రక్రియలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
