– కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో ప్రశ్నించిన ఫలితం
– జనుము పంటతో రైతులకు మేలు
నవతెలంగాణ ఆలేరు
తెలంగాణ రాష్ట్రంలో జూట్ ఎందుకు ప్రొడక్షన్ జరగడం లేదని డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోని కేంద్ర జూట్ కార్పొరేషన్ స్పందించి అధికారులు హైదరాబాద్ తరలివచ్చి రాష్ట్ర అగ్రికల్చర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నవతెలంగాణతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో వరి మిర్చి పత్తి వంటి పంటలు వరుసగా వేయడం వల్ల పంట మార్పుడి లేకపోవడంతో చీడపీడలు ఎక్కువయ్యాయని అదేవిధంగా భూసారైనా దెబ్బతింటుందని ఆయా పంటలకు విపరీతంగా పురుగుమందులు రైతులు కొట్టడంతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూసారం దెబ్బ తినడం వాతావరణం కలుషితమవుతుందన్నారు.
ప్రత్యామ్నాయ పంటను కేంద్ర జూట్ అధికారులు రాష్ట్ర అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులను జనుము పంట వేసే విధంగా ప్రోత్సహించినట్లయితే ప్రోత్సహించి రైతులు కు మేలు జరుగుతుందన్నారు.రైతుల్లో అవగాహన లేకపోవడం వల్లనే సాంప్రదాయ పంటలు వేసి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జలువ పంట వేసినట్లయితే వంద రోజుల్లో కూతకు వస్తుందని అదే విధంగా వాటి విత్తనాలకు బంగ్లాదేశ్ దేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం లాంటి వీటి విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఉందన్నారు.
కేవలం గోన సంచులే తయారీ కాదు ఆ ప్రాంతాల్లో పంట వేసిన 30 రోజుల తర్వాత కోసి ఆకుకూరగా తింటారని మన ప్రాంతంలో పాలకూర చుక్కకూర గంగబాయలు కూర లాగా అక్కడ నిత్యం వాడుతారని చెప్పారు.పత్తి మిరప వరి వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటగా జనుము సాగు చేస్తున్నట్లయితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు రెండో పంటగా ఇతర పంటలు కూడా వేస్తే భూసారం పెరిగి ఉండడం వల్ల ఆ పంటలు కూడా దిగుబడి బాగా వచ్చి ఆదాయం పొందుతారు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని పత్తిలో గులాబీ రంగు తెగులు మిర్చిలో బొబ్బెర తెగులు గత 15లుగా విధులు మించిన పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ శాఖని నిర్వీర్యపరచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సబ్సిడీతో తైవాన్ స్పెయర్లు కల్టివేటర్లు రోటవేటర్లు పవర్ టిల్లర్లు సబ్సిడీపై అందించిన విషయం గుర్తు చేశారు. కేంద్రం నుండి జూట్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో జనుము పంటపై ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించేందుకు వచ్చిన. కళ్యాణ్ కుమార్, మహదేవ్ దత్తలతో తాజ్ దక్కన్ హోటల్లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర జూట్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రంలోజనుము పంట విరివిగా పండించే విధంగా అదేవిధంగా గోనె సంచులు తయారయ్యే పరిశ్రమను ఏర్పాటు చేయాలని రైతులను ఆదుకోవాలని అన్నారు.



