- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
భారీ వర్షాల కారణంగా డోంగ్లి మండలం కేంద్రంలో ఆవాస కేంద్రం నందు 150 మంది కుటుంబ సభ్యులు ఆవాసం ఏర్పాటు చేయడం జరిగింది. గత బుధవారం నుండి ఆదివారం వరకు భోజన సౌకర్యం వసతి కల్పించి వర్షాలు తగ్గిన కారణంగా ఆవాస కుటుంబ సభ్యులను తిరిగి వారి సొంత గ్రామాలైన డోంగ్లి మండలంలోని సిరిపూర్, పెద్ద టాక్లి, గ్రామంలో వారి యొక్క సొంత గ్రామాలకు వాహనాలు ఏర్పాటు చేసి విడిచిపెట్టడం జరిగిందని ఆర్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ పెద్దలు శివాజీ పటేల్, గజానంద్ దేశాయ్, ఎక్స్ ఎం పి టి సి దీన్ దయాల్, సంగ్రామ్ పటేల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
- Advertisement -