Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జనం కొరకు పలు చెరువులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఆర్ఓ మారుతి, ఎస్సై నవీన్ చంద్ర, గిర్ధావర్ రామ్ పటేల్, ఎంపీవో రాము, గ్రామపంచాయతీ అధికారులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..మండల కేంద్రంలో పలు గణేష్ మండపాలు నిర్వహించడం జరిగింది. గణపతి నిమజ్జనం శోభయాత్రను వాటిని దృష్టిలో పెట్టుకొని శాంతి యుతంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు ఎంపీడీవో ఎమ్మార్వో స్థానిక ఎస్సై తో కలిసి రూట్ మ్యాప్ ను తయారు చేసుకొవడం జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.  శాంతి కమిటీలతో మాట్లాడి గణేష్ నిమజ్జనం సజావుగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని చెరువు వద్ద  చిన్న పిల్లలను చెరువులోకి దిగేందుకు అనుమతించబడదని తెలిపారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెరువుల వద్ద చేశారని మండలి నిర్వాహకులు సహకరించాలని అధికారులు కోరడం జరిగింది. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad