Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా  కేంద్రంలో ఏర్పాట్లను చీఫ్ సూపరింటెండెంట్ కనుక గంగాధర్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కృష్ణ కుమార్ పరిశీలించారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు, సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లను తనిఖీ చేశారు.

పరీక్షలు సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ సూపరింటెండెంట్ గంగాధర్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్  కృష్ణ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఇన్విజిలేషన్ బృందం సభ్యులతో సమగ్రంగా పర్యవేక్షణ నిర్వహించారు. తమ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగి, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చీఫ్ చీఫ్ సూపరింటెండెంట్ గంగాధర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -