Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండో విడత పోలింగ్ ను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలి

రెండో విడత పోలింగ్ ను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలి

- Advertisement -

 జిల్లా కలెక్టర్ హనుమంతరావు .. 
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

రెండవ విడత పోలింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం గ్రామ పంచాయతి ఎన్నికల్లో భాగంగా రెండవ విడత ఎన్నికలు జరగనున్న భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో దివ్యబాల పాఠశాల, వలిగొండ మండలం కేంద్రంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల డ్యూటీ లు వేసిన అధికారులందరూ వచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాజరు కాని వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పోలింగ్ సిబ్బంది అందరూ పోలింగ్ సామగ్రి అయిన బ్యాలెట్ బాక్స్ లు సులభంగా ఓపెన్ అవుతున్నాయ లేదా చూసుకోవాలన్నారు.మీ గ్రామ పంచాయతీ కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు , స్వస్తి గుర్తు స్టాంపు, ఫారం -9 వచ్చాయా అని చెక్ చేసుకోవాలన్నారు. ముందుగా  ఓటర్ లిస్ట్ ఇక్కడే క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే  అన్ని సిద్ధం చేసుకోవాలన్నారు.పోలింగ్ కేంద్రం బయట  గుర్తుల తో పోలీ ఉండే ఫారం-9 అతికించాలని తెలిపారు.ఓటర్ లు  అందరూ రెండు బ్యాలెట్ పేపర్లు  బ్యాలెట్ బాక్స్ లో వేస్తున్నారా లేదా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.పోలింగ్ పూర్తి అయినా పోలింగ్ సామగ్రిని విధిగా రిసెప్షన్ సెంటర్ లో అందజేయాలని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో ఏ ఒక్క పేపర్ కూడా వదలకుండా తీసుకొని రావాలన్నారు.పోలీస్ సిబ్బంది  పోలింగ్ కేంద్రంలో కి ఓటర్ లు ఫోన్ లు తీసుకురాకుండా చెక్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు గుంపులు గా ఉండకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల విధులు అధికారులందరూ భాధ్యతతో  నిర్వహించి సజావుగా జరిగేలా చూడాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించి స్వయంగా కలెక్టర్  సిబ్బందికి వడ్డించారు.సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జలపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా పోలీస్ బందోబస్తుతో వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -