- Advertisement -
- – ఔత్సాహిక, ఆసక్తి ఉన్న ఎస్సీ రైతుల నమోదుకు ఆహ్వానం..
– సైంటిస్ట్ అండ్ హెడ్ విజయ్ క్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట - శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కు చెందిన అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో భారతీయ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ సౌజన్యం లో ఎస్సీ (షెడ్యూల్ క్యాస్ట్)కి చెందిన రైతులకు వివిధ ఉద్యాన పండ్ల మొక్కలు అనగా మామిడి, కొబ్బరి, సపోట, జమ, పనస, కరివేపాకు మొక్కలను ఒక్కో రైతుకు 10 చొప్పున 300 మందికి అందజేయడం తో పాటు వాటి పెంపకం గురించి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తాం అని స్థానిక హెచ్ఆర్సీ హెడ్,సైంటిస్ట్ విజయ్ క్రిష్ణ తన కార్యాలయంలో మంగళవారం తెలిపారు. ఆసక్తి, ఔత్సాహిక రైతులు వారి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకోసం రైతు ఆదార్ కార్డు, భూమి పాస్ పుస్తకం, జిరాక్స్ తో స్థానిక కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం ఈ ఫోన్ నెంబర్ లను సంప్రదించాలని కోరారు.
- Advertisement -