సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థిగా ముత్తమాల సంపూర్ణ
బీఆర్‌ఎస్, జనసేన మద్దతు
నవతెలంగాణ-వైరాటౌన్
ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్తమల సంపూర్ణ, విజయరాజు దంపతులతో పాటు 100 కుటుంబాలు మంగళవారం రాత్రి సీపీఐ(ఎం)లో చేరారు. వారికి సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్.. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ విప్పలమడక గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముత్తమాల సంపూర్ణను ప్రకటించారు. వార్డు మెంబర్లుగా ముత్తమాల సరితకుమారి, మేరీ, పత్తిపాటి శాంతకుమారి, ముత్తమాల దేవానందం, ముత్తమాల పుష్పరాజ్, సత్తెనపల్లి మాధవి, ముత్తమాల వెంకటరత్నం, కంచె ఏసుమణి, తేల్లూరి వెంకటి, తేళ్లూరి కుమారిని ప్రకటించారు.
సీపీఐ(ఎం) అభ్యర్థులకు బీఆర్‌ఎస్, జనసేన పార్టీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాల నుంచి సీపీఐ(ఎం) పరిపాలనలో విప్పలమడక గ్రామపంచాయతీ ఉందని, మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించి గరిడేపల్లి వారసత్వాన్ని నిలపాలని కోరారు. తొలుత గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్, గరిడేపల్లి వెంకటేశ్వరరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, వైరా డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు బాణాల వెంకట్రావమ్మ, ద్రోణాదుల నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి గరిడేపల్లి సుబ్బారావు, పారుపల్లి నాగేశ్వరరావు, మేడ రాంబాబు, మాజీ ఎంపీటీసీ బూర్గు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.



