Tuesday, October 7, 2025
E-PAPER
Homeజిల్లాలురోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ-మోర్తాడ్: జాతీయ రహదారి 63 మండల కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాము మంగళవారం తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కి చెందిన తాటికొండ పురుషోత్తం(60) సోమవారం ts 22 H2436 గల వాహనంలో నిజాంబాద్ వెళ్లి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వస్తుండగా.. మండల కార్యాలయం సమీపంలోని డివైడర్‌ను ఢీకొనడంతో.. పురుషోత్తం కుడి భుజానికి గాయమై సంఘటన ప్రదేశంలోనే మృతి చెందినట్లు తెలిపారు. పురుషోత్తం కూతురు ప్రత్యుష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. మృతి దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్ప‌త్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -