Tuesday, September 16, 2025
E-PAPER
Homeక్రైమ్రైలు ప్రమాదంలో ఒకరు మృతి..మరో వ్యక్తికి గాయాలు

రైలు ప్రమాదంలో ఒకరు మృతి..మరో వ్యక్తికి గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సాయినగర్ షిరిడి – తిరుపతి – చిక్కమంగళూర్ -వెళ్లే రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి రెండు చేతులు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం గ్రామానికి చెందిన తెలుగు నర్సింలు (55)అనే వ్యక్తి మృతి చెందగా.. మహారాష్ట్ర ఔరంగబాద్ కు చెందిన అనీల్ ఖేడ్కో (38) రెండు చేతులు కోల్పోయాడు. మృతుడు నర్సింలు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నాడు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిర్వహించి హైదరాబాద్ తరలించారు. ఒకే రోజు ఒకే రైలులో రెండు సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -