– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అటవీ శాఖ సిబ్బంది జీపుపై బ్లేడ్ ట్రాక్టర్ తో దాడి చేసిన మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన అబ్దుల్ జూబెర్ ను మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 10వ తేదీరాత్రి అమీర్ నగర్ ఫారెస్ట్ బీట్ లో అటవీ భూమినీ అక్రమంగా చదును చేస్తున్నారని సమాచారం అందడంతో అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లారన్నారు. అటవీ శాఖ సిబ్బంది నుండి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో జుబేర్ అనే వ్యక్తి అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ జీపును, అతని బ్లేడ్ ట్రాక్టర్ తో పలు సార్లు ఢీ కొట్టి అక్కడి నుండి జుబేర్ పారిపోయాడని ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పవన్ కుమార్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా జుబేర్ ను అదుపులోకి తీసుకొని, ట్రాక్టర్ సీజ్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ వాహనంపై దాడి కేసులో ఒకరి రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES