నవతెలంగాణ-బిచ్కుంద
విద్యార్థులు చదువులో రాణించి తమ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బిచ్కుంద బార్ అసోసియేషన్ సభ్యులు మల్లేష్ అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవాదికార సంస్థ దినోత్సవం సందర్భంగా బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు న్యాయపరమైన విషయాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. విద్యభ్యాసంలో ఇంటర్మీడియట్ చదువు కీలకమైందనీ ర్యాగింగ్ కు పాల్పడవద్దని విద్యార్థులు కష్టపడి చదువుకునే తత్వం అలవర్చుకోవాలని ఇంటర్మీడియట్ తరువాత చదువులో విద్యార్థులు ఎంచుకున్న ఉన్నత చదువులు చదువుకొని తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రవి, మొహమ్మద్, మనోజ్, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



