నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీకి ఒక్క ఓటు పడిన కేరళ సంస్కృతిని ఆ పార్టీ నాశనం చేస్తుందని సీఎం పినరయి విజయన్ విమర్శించారు. ఇవాళ ఓనమ్ పండగా ముగింపు సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ఇప్పటికే వ్యవస్థలతో పాటు రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఓనమ్ ప్రతిష్టతను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. ఇంతకు ముందుకు జరిగిన ఎర్నాకులం ఓనమ్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారని, ఓ వ్యక్తి వచ్చి మహావిష్టు ఫోటో చూపించి.. ఆ తర్వాత వామనుడిని మహావిష్టువు పాతాళంలోకి తొక్కిన సందేశాన్ని తనకు చూపించడాన్ని సీఎం వివరించారు. ఆ తరహాలో ఓనమ్ ప్రతిష్టతను, రాష్ట్ర సంప్రదాయాలను మార్పు చేసే కుట్రలకు బీజేపీ దళం సన్నాహాలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీకి ఎవరూ కూడా మద్దతుగా ఉండకూడదని సీఎం విజయన్ పిలుపునిచ్చారు. వాళ్ల రాకతో అంతా మారిపోతుందని, అందుకు నిదర్శం గత అనుభవాలేనని ఆయన గుర్తు చేశారు. రాజకీయ నాయకులే కాకుండా ఏ ఒక్క ఓటర్ కూడా బీజేపీ కి ఓటు వేసినా..కేరళ ప్రతిష్టను దిగజార్చతారని సూచించారు.
బీజేపీకి ఒక్క ఓటు పడిన కేరళ సంస్కృతి నాశనమే: సీఎం పినరయి విజయన్
- Advertisement -
- Advertisement -