- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని యానాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ పగిలి మంటలు ఎగసిపడ్డాయి. దరియాలతిప్ప ఐల్యాండ్ నెంబర్ 3 వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి చర్యలు చేపట్టారు. సముద్రంలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో సరఫరా నిలిపివేయడంతో శుక్రవారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయని యానాం ఎస్పీ కోదండరాం తెలిపారు.
- Advertisement -