- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి . ఈ సందర్భంగా లాడేగాం గ్రామంలో మరియు పెద్దగుల్ల , గ్రామంలో రెవెన్యూ అధికారుల బృందం ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సులు కొనసాగించడం జరిగింది . ఈ సందర్భంగా న్యాయ తాసిల్దార్ హేమలత మాట్లాడుతూ పెద్దగుల్లా గ్రామంలో భూ వివాదాలు సమస్యలు కాకుండా పట్టా పాస్ పుస్తకంలో పట్టాదారుని పేరు , క్రమ సంఖ్య నెంబర్లు , పట్టాదారులు పాస్ పుస్తకంలో తప్పులు దొర్లితే భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పెట్టుకున్న వాటిని సరి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయబ్ తహసిల్దార్ , రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -