Thursday, January 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు‌..

కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలో తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 57.91 శాతం పోలింగ్‌ నమోదయింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు మండలాల్లోని 120 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 54.65 శాతం నమోదయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నాలుగు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61.64 శాతం పోలింగ్‌ రికార్డయింది. పెద్దపల్లి జిల్లాలో 57.21 శాతం, మహబూబ్‌నగర్‌లో 60.63 శాతం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 55.90 శాతం, సూర్యాపేట జిల్లాలో 60.13 శాతం, జనగామలో 51.82 శాతం చొప్పున పోలింగ్‌ నమోదయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -