Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకై పోరాడే కమ్యూనిస్టులకే పట్టం కట్టండి 

ప్రజలకై పోరాడే కమ్యూనిస్టులకే పట్టం కట్టండి 

- Advertisement -

•సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
నవతెలంగాణ-మర్రిగూడ 
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే,గ్రామపంచాయితీ సాధారణ ఎన్నికల్లో బరిలో ఉన్న కమ్యూనిస్టు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓటర్లకు సూచించారు. మంగళవారం మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ఆ గ్రామ సిపిఐ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న చెల్లం పాండురంగారావు కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కష్టం వస్తే కమ్యూనిస్టుల వైపు చూసి,ఓట్లు వచ్చినప్పుడు కష్టం తెచ్చే పార్టీలవైపు చూడొద్దని ఓటర్లకు హితోపదేశం చేశారు. కార్మిక కర్షక నిరుపేద వర్గాలకు ఎర్రజెండా ఎప్పుడు తోడుగా ఉంటుందని,ప్రజా సమస్యలే కమ్యూనిస్టుల ఎజెండా అని గుర్తు చేశారు.ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధికై నిక్కచ్చైన కమ్యూనిస్టు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకొవాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు,ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షం రెడ్డి,మండల నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -