Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజల పక్షాన ఉద్యమం చేసేది సీపీఐ(ఎం) మాత్రమే

ప్రజల పక్షాన ఉద్యమం చేసేది సీపీఐ(ఎం) మాత్రమే

- Advertisement -

 పార్టీ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు రవికుమార్..
నవతెలంగాణ – జన్నారం

ప్రజల పక్షాన పోరాటాలు చేసేది సీపీఐ(ఎం) అని ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు రవికుమార్ అన్నారు. శుక్రవారం జన్నారంలోని జ్యోతి గార్డెన్స్లో నిర్వహించిన సీపీఐ ఎం మంచిర్యాల జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ .. బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల, గిరిజనుల ఉనికిని ప్రశ్నార్థకం చేసే విధంగా జీవోలను జారీ చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. జన్నారం బండ ల పేద ప్రజల  ఉపాధిని దెబ్బతీసే విధంగా  అటవీ ఆంక్షలు  పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వెళ్లే జాతీయ రహదారి పైనే జన్నారం పట్టణం ఉన్నది పట్టణానికి రావాలంటే భారీ వాహనాల రాకపోకలను అటవీ శాఖ అధికారులు నిలిపివేయడంతో, కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుదాలనే  ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర  ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు సహకరించాలన్నారు. గతంలో 49 జీవోపై ఉద్యమాలు చేస్తే ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు.

కానీ ఆ జీవోను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారీ వాహనాలపై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. సీపీఐ(ఎం) ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ  రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా గైడ్ పైళ్ల ఆశయ, జిల్లా కార్యదర్శి సంకే రవి, మండల కార్యదర్శి కనికారం అశోక్ నాయకులు కూకటికారి బుచ్చయ్య, కొండ గొర్ల లింగన్న, అంబటి లక్ష్మణ్ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -