Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే చదువుల్లో, క్రీడల్లో రాణిస్తారు

మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే చదువుల్లో, క్రీడల్లో రాణిస్తారు

- Advertisement -

– ప్రభుత్వ కళాశాలలోప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 
నవతెలంగాణ- కమ్మర్ పల్లి 
విద్యార్థిని విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే చదువులో, క్రీడల్లో రాణిస్తారని కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ నోడల్ అధికారిని పద్మలత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ నోడల్ అధికారిని పద్మలత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులు ఎప్పుడు మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. అదేవిధంగా విద్యార్థినిలు ఎలాంటి సందర్భంలోనైనా మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దని, పరీక్ష సమయంలో కూడా సానుకూల దృక్పథంతో చదివి మంచి మార్కులు తెచ్చుకుని విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మధు, రాజ్ కుమార్, వైష్ణవి, వెంకటేశ్, గంగాధర్, మురళీకృష్ణ, స్వాతి, స్రవంతి, ఏఎన్ఎంలు కృష్ణవేణి, స్వరూప, ఆశ వర్కర్లు హారిక, శోభ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -