నవతెలంగాణ – బిచ్కుంద 
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బిచ్కుంద పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పనితీరును స్టేషన్లో నిర్వహించే విధులు, పౌరులకు అందుతున్న సేవలు డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్ ఆయుధాల పనితీరును డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు. 24 గంటలు పోలీస్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఫ్రెండ్లీ పోలీసింగ్ పై వివరించారు. చదువు ఒకటే విద్యార్థుల జీవితాలను మారుస్తుందని ఉన్నత చదువులు చదువుకొని తమ తల్లిదండ్రుల పేరు, ఉపాధ్యాయుల, గ్రామ పేరుతో పాటు ప్రజలు గర్వించే విధంగా పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    