Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆపరేషన్‌ కగార్‌ను ఆపాలి

ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలి

- Advertisement -

– నేడు హైదరాబాద్‌లో మహాధర్నా
– శాంతి చర్చల కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహణ
– హాజరు కానున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఆపాలనీ, కాల్పుల విరమణను ప్రకటించాలనీ, మావోయిస్టుల తో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తూ శాంతి చర్చల కమిటీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నాచౌక్‌లో మహాధర్నా జరగనుంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ ధర్నా ప్రారంభమవుతుంది. జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రొఫెసర్‌ జి హరగోపాల్‌, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి హరీశ్‌రావు, టీజేఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి కె నారాయణ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు కెజి రామచందర్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రాజా, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి, ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌రెడ్డి, వీసీకే నాయకులు జిలకర శ్రీనివాస్‌తోపాటు ఆప్‌ నాయకులు మాట్లాడతారు. వారిలో ప్రముఖ పత్రికా సంపాదకులు కె శ్రీనివాస్‌, కె రామచంద్రమూర్తి, సినీనటుడు ఆర్‌ నారాయణమూర్తి, ఆలిండియా నాయకులు ఎంఎఫ్‌ గోపీనాథ్‌, సీఎస్సీ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, అరుణోదయ నాయకులు విమలక్క, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు హాజరై ప్రసంగిస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad