నవతెలంగాణ – కంఠేశ్వర్
ఆపరేషన్ కగారును ఉపసంహరించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) నాయకులు చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, ఎస్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు పి జ్యోతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల పెరుగుదలకు కారణమైన సమస్యలను పరిష్కరించి మావోయిస్టులు పెరగకుండా చూడాలని అంతేకానీ ఆపరేషన్ కగారు పేరుతో అమాయకులైన గిరిజనులను మావోయిస్టు అగ్ర నాయకులను చంపటం వలన ప్రజా సమస్యల పైన ప్రజలు చేయకుండా ఆపలేరని ఇది గ్రహించాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా కాశ్మీర్లో దాడిలో ఉగ్రవాదులను అరికట్టడంలో ప్రభుత్వం కాశ్మీర్ సమస్యలను పరిష్కారం పైన దృష్టి పెట్టి అమాయక ప్రజలను ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను పట్టుకోవాలని ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నట్టుగా మాట్లాడటం ప్రధానమంత్రి దానిపైన నోరు మెదపకపోవడం సరైనది కాదని ఆమె అన్నారు రాబోయే కాలంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఇటీవల జరిగిన 24వ అఖిలభారత మహాసభలో నిర్ణయించటం జరిగిందని అందుకోసం పార్టీ కసరత్తు చేస్తుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్ ,నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నేసాబ్, కొండ గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగారును ఉపసంహరించుకొని, ప్రజా సమస్యలను పరిష్కరించాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -