Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పలు విమానాశ్రయాలు మూసివేత

‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పలు విమానాశ్రయాలు మూసివేత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై భారత్‌ సైన్యం మెరుపుదాడులకు దిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు తెరవవద్దని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ పాకిస్థాన్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్‌ గగనతలం మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటించింది. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ మొదటి ప్రాధాన్యని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు స్పైస్‌ జెట్‌ ప్రకటించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad