Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హామీపత్రంలో ఖైదీల కుటుంబీకుల అభిప్రాయాలు ముఖ్యం

హామీపత్రంలో ఖైదీల కుటుంబీకుల అభిప్రాయాలు ముఖ్యం

- Advertisement -

జిల్లా స్థాయి సాధికారిక కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ 
నవతెలంగాణ – వనపర్తి 

ఆర్థిక స్థోమత లేని కారణంగా హామీ పత్రం డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీల బెయిల్ విషయంలో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు సైతం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తన క్యాంపు కార్యాలయంలో హాజరయ్యారు. మిగిలిన కమిటి సభ్యులలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజనీ, మహబూబ్ నగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ రవి కుమార్ తమ తమ కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ రోజు విచారణలో నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలకు బెయిలు లభించినప్పటికి ఆర్థిక స్తోమత లేని కారణంగా హామీ పత్రం ఇవ్వలేని (7) మంది ఖైదీలపై జిల్లా స్థాయి కమిటిలో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు స్యూరిటీ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని రిమార్కులో నమోదు చేస్తున్నారని, అలాంటి వారి కుటుంబ సభ్యులను సైతం కమిటి ముందుకు పిలిచి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని జైలర్ కు సూచించారు. సాధికార కమిటి ద్వారా ఎవరికైతే హామీ పత్రం డబ్బులు మాఫీ చేసి జైలు నుండి విడుదలకు అనుమతించడం జరుగుతుందో అలాంటి వారిని విడుదలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -