– అంతర్జాతీయ సంబంధాలకు ప్రాధాన్యత : కార్మికశాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అన్ని రంగాల విద్యార్థులకు అవకాశాలు తక్కేలా అంతర్జాతీయ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు కార్మికశాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టామ్‌కామ్ ద్వారా ఇప్పటికే నర్సులకు జర్మనీలో అవకాశాలు కల్పిస్తున్నామనీ, అదే విధంగా ఐటీఐ తదితర రంగాలకు చెందిన విద్యార్థులకు కూడా ఇలాంటి శిక్షణ ఇచ్చేలా భవిష్యత్తులో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. జర్మనీ ప్రతినిధులతో మంత్రితో పాటు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ భేటీ అయ్యారు. జర్మనీ నుంచి బైన్కా మరియా కుంజ్ తదితరులతో పాటు జీఐజడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు జర్మనీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ట్రిపుల్ విన్ ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. జర్మనీలో అవకాశాల కోసం ఎంపిక చేసిన నర్సింగ్ ఆఫీసర్లకు జర్మనీ భాషపై ఉచితంగా శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9 నుంచి 17 వరకు ట్రిపుల్ విన్ ప్రాజెక్టు – 2024 బ్యాచ్‌కు చెంది, జర్మనీ భాషలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సందర్శన సందర్భంగా తార్నాకలోని జర్మనీ ప్రతినిధులు టీజీఆర్టీసీ నర్సింగ్ విద్యార్థులను కలిశారు. జర్మనీలో నర్సింగ్ ఆఫీసర్లకు ఇస్తున్న శాలరీ ప్యాకేజీ, కుటుంబ వీసా స్పాన్సర్ షిప్ తదితర సౌకర్యాలను వివరించారు.
అన్ని రంగాల విద్యార్థులకు అవకాశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES