- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇండియా బ్లాక్ ఎంపీలు పాల్గొన్నారు. ‘కార్పొరేట్ జంగిల్ రాజ్‌కి నో – కార్మిక న్యాయానికి ఎస్’ అని రాసిన బ్యానర్లు పట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.
కాగా, పార్లమెంటు సమావేశాల రెండో రోజు కూడా ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో.. కేంద్ర ప్రభుత్వం దీనిపై డిసెంబర్ 9న చర్చించేందుకు ఆమోదించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
- Advertisement -



