Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ SIRపై చ‌ర్చించాల‌ని రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల ఆందోళ‌న‌

బీహార్ SIRపై చ‌ర్చించాల‌ని రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేడు రాజ్యసభలో బీహార్‌లో చేపట్టే ఎస్‌ఐఆర్‌, బెంగాలీ వలసదారులపై, కేరళ నన్స్‌ అరెస్టులకు సంబంధించిన నోటీసులను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ప్రస్తావించారు. వీటిపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు నిరసన చేశాయి. అయితే వీటిలో దేనికీ చర్చించడానికి హరివంశ్‌ సిద్ధపడలేదు. దీంతో ప్రతిపక్షాల ఆందోళనలతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

మంగళవారం పార్లమెంటులో ప్రధాని ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేయొద్దని ఆయన కోరారు.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగంచాలని హోం మంత్రి అమిత్‌ షా నేడు లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -