నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి బీహార్‌లో ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. 17వ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ ఇండియా బ్లాక్ కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో ఎంపీలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సుప్రియా సులే తోపాటు తదితరులు పాల్గొన్నారు. 124 నాట్ ఔట్ అనే(ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో బిహార్‌కు చెందిన మింతా దేవి గురించి ప్రస్తావించారు. మింతా దేవి పేరుతో ఉన్న ఓటరు ఐడీలో ఆమె వయస్సు 124 అని ముద్రించినట్లు రాహుల్ పేర్కొన్నారు) టీ షెర్టులు ధరించి ఎంపీలందరూ ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిన్న ఈసీ ఓట్ల చోరీ అంటూ ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాయాలనికి చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా బయలు దేరిన ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎంపీలకు, పోలీసలుకు మధ్య గర్షణ వాతావరణం నెలకొంది. ఈ తొపులాటలో పలువురు ఎంపీలు కిందపడిపోయారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
