Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసనకు ప్ర‌తిప‌క్షాలు ప్లాన్

జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసనకు ప్ర‌తిప‌క్షాలు ప్లాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీహార్‌లో ఈసీ చేప‌ట్టిన ఎస్ఐఆర్ ప్ర‌క్రియ‌పై విప‌క్షాలు మండిప‌డుత‌న్న విష‌యం తెలిసిందే. ఉభ‌య స‌భ‌ల్లో ఎస్ఐఆర్ పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని పార్ల‌మెంట్ స‌మ‌వేశాలు ప్రారంభ‌మైన‌కానించి విప‌క్షాలు మోడీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా బీహార్‌లో ఎస్ఐఆర్ పేరుతో ఈసీ ఓట్ల చోరీ య‌త్నిస్తుంద‌ని ఇండ‌యా బ్లాక్ కూట‌మి పార్టీలతో క‌లిసి రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర మొద‌లుపెట్టారు. ఎన్డీఏ (NDA) సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ ఆరోపించారు.

ఢిల్లీ వేదిక‌గా ఆదివారం ఎన్నిక‌ల క‌మిష‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వ‌ని, వారంలోపు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీలు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు లెవ‌నెత్తిన సందేహాల‌పై స‌మాధానాలివ్వ‌కుండా..కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అర్థ‌ర‌హిత వ్యాఖ్య‌లు చేశార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ కామెంట్ చేసిన తరుణంలో ఆయనపై అభిశంసనకు విపక్షాలు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

మ‌రోవైపు ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్‌ లో ఓట్ల జాబితా సవరణకు వారు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ త‌న ప‌దవీకి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాయి.

.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad