- Advertisement -
- – పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
- – ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ హెచ్చరిక
- – కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నూతన పెంచిన విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి లోని కలెక్టరేట్ ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం జేఏసీ నాయకులు జావేద్ అలీ, బి సాయిలు, అనుముల రామచందర్, గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వైద్యనాథ్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -