నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ వాతావరణశాఖ కేరళ ప్రభుత్వానికి కీలక హెచ్చరిక చేసింది. ఆ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. కసరాగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, పాలక్కాద్, త్రీసుర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఈనెల 14 నుంచి17 వరకు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు దాదాపు రెండు వారాల తరువాత మళ్లీ చురుకుగా మారాయి, గురువారం తెల్లవారుజామున కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిపించాయి. దీంతో కర్ణాటక, కేరళలతో పాటు పలు జిల్లాల్లో భారీస్థాయిలో వర్షపాతం నమోదు కానుందని భారత్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
కేరళలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Advertisement -
- Advertisement -