Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమానవీయ ఘటనపై విచారణకు ఆదేశం

అమానవీయ ఘటనపై విచారణకు ఆదేశం

- Advertisement -

విచారణ కోసం నేడు జడ్చర్లకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్
బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ – జడ్చర్ల

జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఒక శవాన్ని కుక్క పీక్కుతిన్న ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.జే. అజయ్ కుమార్ మంగళవారం విచారణ కు వస్తున్నారు. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఫిర్యాదు చేశారు. వెంటనే అజయ్ విచరణ జరిపి, సంబంధిత భాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -