రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుత కాలానుగుణంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని ఆచరించాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనంలో ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ , తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం సహకారంతో నిర్వహించిన జాతీయ మహా కిసాన్ మేళా ముగింపు సభలో ఆయన మాట్లాడారు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనంతరం ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ వారు ఎంపిక చేసిన ఉత్తమ రైతులకు అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 43 మంది రైతులకు తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం తరుపున అభ్యుదయ రైతులుగా ప్రశంసాపత్రాలను అందజేశారు.
కిసాన్ మహా మేళాలో భాగంగా నేలలో ఉండే సూక్ష్మజీవులు, పోషకాల గురించి, ఆయిల్ పామ్ సాగు ఆవశ్యకత, ఉద్యాన, అధిక విలువ గల పంటల సాగు పద్ధతుల గురించి, డిజిటల్ వ్యవసాయం -వ్యవసాయంలో కృత్రిమ మేధ, డ్రోన్ల వినియోగం, ఐటి వినియోగం గురించి, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమాలలో శాస్త్రవేత్తలు, రైతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ అధ్యక్షులు ఎమ్మెస్ రెడ్డి, రైతుగా పద్మశ్రీ అందుకున్న చింతల వెంకట రెడ్డి, మారెఫైడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజరు కల్లాం, వ్యవసాయ విశ్వ విద్యాలయం రిటైర్డ్ విస్తరణ సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మెన్ బీ. కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు శ్రేయస్కరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



