Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేద విద్యార్థులకు ఇంగ్లీష్ అందించడమే మా ధ్యేయం..

పేద విద్యార్థులకు ఇంగ్లీష్ అందించడమే మా ధ్యేయం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
నిరుపేద విద్యార్థులకు తక్కువ పిజులతో ఇంగ్లీష్ మీడియం విద్య బోధన అందించడమే ద్యేయంగా గత 21 సంవత్సరాలుగా మండలంలోని కొయ్యుర్ గ్రామంలో దేవి విద్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కొనసాగిస్తున్నట్లుగా పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు తెలిపారు. ఈ సందర్భంగా భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు పురస్కరించుకుని నవతెలంగాణతో కాసేపు ముచ్చటించారు. మండలంలోని గాదంపల్లి,వళ్లెంకుంట,ఎడ్లపల్లి,కొయ్యుర్ నుంచే కాకుండా కాటారం మండలంలోని గంగారం, మంథని మండలంలోని అడవి సోమన్ పల్లి గ్రామాల నుంచి 250 మంది విద్యార్థులు తమ పాఠశాలలో ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నట్లుగా తెలిపారు.

విద్యార్థులను నిత్యం తీసుకరావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. పాఠశాలలో అర్హులైన 9మంది ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.21 సంవత్సరాలుగా ఎంతోమంది చిన్నారులను తీర్చిదిద్దుతామని,పాఠశాలలో నాణ్యమైన ఆంగ్ల విద్యాబోధనతోపాటు, రీడింగ్,రైటింగ్,స్పికింగ్ కు ప్రత్యేక స్థానం ఇస్తున్నట్లుగా తెలిపారు.పాఠశాలలో కల్సర్, కోకల్సర్ పోగ్రామ్స్,సైన్స్ స్పెర్ పోగ్రామ్స్ చేస్తున్నట్లుగా,తెలంగాణ స్పోర్ట్స్,నవోదయలో చిన్నారులు ప్రతియేటా సీట్లు సాధిస్తున్నట్లుగా వివరించారు.చిన్నారుల ప్రతి విజయంలో ఉపాధ్యాయు బృందం బోధన,తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad