- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ సర్పంచ్ గా దావూద్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఆదివారం గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబం ఇప్పటివరకు గ్రామ ప్రజల సేవలకే అంకితమైందని తెలిపారు. ఇప్పటివరకు గ్రామస్తులు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ పదవులు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. తాజా మాజీ ఎంపీటీసీగా తామే కొనసాగుతున్నప్పటికీ, సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ గ్రామ ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే.. ప్రజాసేవకే పునరంకితం అవుతామని అన్నారు.
- Advertisement -



