Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంక్షేమమే మా ధ్యేయం..

రైతు సంక్షేమమే మా ధ్యేయం..

- Advertisement -

పాలడుగు వెంకటకృష్ణ.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట

లక్నవరం కోట కాలువ పూడిక పనులకు శ్రీకారం లక్నవరం సరస్సు నుండి పంటలకు సాగునీరు అందించే కోట కాలువ పూడిక పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు కాలువల పూడికతీత పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే లక్నవరం సరస్సులోకి గోదావరి జలాలను అందించే విధంగా మంత్రి సీతక్క కృషి చేస్తున్నారని అన్నారు.

కాలువలు శుభ్రంగా లేవని రైతులు కోరిన వెంటనే సిల్ట్ తీసేందుకు అధికారులను ఆదేశించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నల పార్టీ. రైతు సంక్షేమమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఎకరానికి 12 వేల పెట్టుబడి సాయం, రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. సన్నధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, ఈక జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -