Monday, January 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలు ఆత్మగౌరవంతో బతకడమే మా లక్ష్యం

పేదలు ఆత్మగౌరవంతో బతకడమే మా లక్ష్యం

- Advertisement -

కొత్త వారూ గృహజ్యోతికి దరఖాస్తు చేయొచ్చు
లబ్ధిపొందుతున్న 52.82 లక్షల కుటుంబాలు
200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే : అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గృహవినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. రాజకీయ పార్టీలు, వర్గాలకు అతీతంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. గృహజ్యోతి పథకం కోసం కొత్తగా అర్హత ఉన్న వారూ ఎంపీడీవో కార్యాల యంలో ప్రజాపాలన అధికారులను కలిసి దరఖాస్తు చేయొచ్చని సూచించారు. పాతవారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 1.15 కోట్ల కుటుంబాలుంటే 52,82,498 కుటుంబాలు లబ్ధిపొం దుతున్నాయని వివరించారు. గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు రూ.3,593 కోట్లు ఎస్పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌కు చెల్లించామని చెప్పారు.

కొత్త రేషన్‌కార్డు వచ్చిన వారికి వర్తింపజేయాలి : మధుసూదన్‌రెడ్డి
గృహజ్యోతి పథకంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్‌ సభ్యుడు జి మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా రేషన్‌కార్డులు తీసుకున్న వారికి, కిరాయి ఇంటి నుంచి సొంతింటికి మారిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. కాంగ్రెస్‌ సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గృహజ్యోతి వెబ్‌సైట్‌ 365 రోజులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దానం నాగేందర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండు కోట్ల వరకు జనాభా ఉంటే గృహజ్యోతి లబ్ధిదారులు మాత్రం ఆరు లక్షల కుటుంబాలే ఉన్నాయని అన్నారు. పేదలకు జీవనాధారంగా ఈ పథకం వర్తింపజేయడం లేదని చెప్పారు. గృహజ్యోతి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని కాంగ్రెస్‌ సభ్యులు నాగరాజు, ఆది శ్రీనివాస్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -