Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నియోజకవర్గ ప్రజల క్షేమమే మా లక్ష్యం

నియోజకవర్గ ప్రజల క్షేమమే మా లక్ష్యం

- Advertisement -

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్య మురళీ నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు. అలాగే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ప్రజాల క్షేమమే నా లక్ష్యమని మహబూబాద్ శాసనసభ్యుడు భూక్య మురళి నాయక్ బుధవారం ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి అని కోరినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి, నిరంతరం పర్యవేక్షణ జరిపేలా ఆదేశాలు జారీ చేశారు అని చెప్పారు.

మహబూబాబాద్ నియోజకవర్గంలో వాగులు అధికంగా ఉన్నందున, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కలెక్టర్లు, జిల్లా అధికారులందరితో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులతో మాట్లాడమని చెప్పారు. అధికారులంతా సహకరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గo ప్రజలు క్షేమంగా ఉండేందుకు అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్షించామని తెలిపారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిన వెంటనే సమ్మెకు అధికారులతో మాట్లాడవచ్చని లేదా మా దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించినందుకు ముందుంటామని అన్నారు. ప్రజలు ఎవరు కూడా భయపడవద్దని తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజలకు అవగాహన కల్పించి, వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాధ్యత మనపై ఉందని అన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -