Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఖజానా నింపడమే మా లక్ష్యం 

ప్రభుత్వ ఖజానా నింపడమే మా లక్ష్యం 

- Advertisement -
  • – ట్రాఫిక్ సమస్యలతో మాకేంటి సంబంధం 
    – మేము ట్రాఫిక్ పోలీసులమే
    నవతెలంగాణ – నిజాంబాద్ సిటీ
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిల వద్ద నగర లోని ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులోను సాయంత్రం సమయంలో నగర ప్రజలు వారికి అవసరాల నిమిత్తం క్రయవిక్రయాలు చేయుటకు, స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్లే సమయం అయినందున, సాయంత్రం సమయంలో కచ్చితంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఏమీ పట్టనట్టుగా గాంధీ చౌక్ చౌరస్తాలను, నెహ్రూ పార్క్ చౌరస్తా వద్దను, హిందూ బేకరీ చౌరస్తా వద్దను అందులోనూ మంగళవారం నాగుల పంచమి అయిన్నందున కనీసం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడితే ఏలా…? ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధంగా ట్రాఫిక్ సిబ్బంది ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అవి ఏమీ పట్టనట్టుగా.. మాకు ఒకే ఒక్క లక్ష్యం… ప్రభుత్వ ఖజానాను నింపేందుకు మాత్రమే, మేము పని చేస్తున్నాము. మాకు ప్రభుత్వం టార్గెట్ ఇచ్చిందని, అందుకోసమే మేము పని చేస్తున్నామని, ప్రత్యేకంగా నిఖిల్ సాయి చౌరస్తా వద్ద 9 మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తూన్నారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీలను చేస్తూ ప్రత్యేకంగా ఆ చౌరస్తాలో నాలుగురు నాలుగు మూలల వద్ద నలుగురు కానిస్టేబుళ్లు ఫైన్ లు విధించే వద్ద ఆరుగురు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. దీంతో నగర ప్రజలు ఇదేంత విడ్డూరం… నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసు సిబ్బంది, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని నగర ప్రజలు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతున్నారు. 
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad