Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మన పాఠశాల...మన ఆత్మగౌరవం ప్రతిజ్ఞలు

మన పాఠశాల…మన ఆత్మగౌరవం ప్రతిజ్ఞలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఆయా పాఠశాలల్లో సోమవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కమ్మర్ పల్లి శాఖ ఆధ్వర్యంలో మన పాఠశాల…మన ఆత్మగౌరవం అనే నినాదంతో అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ స్థాయిలో ఏబిఆర్ఎస్ఎం పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల శాఖ అధ్యక్షులు సల్లూరి కిషన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో బడి పట్ల ఉన్న ప్రేమ, అభిమానము, బాధ్యతలు గుర్తు చేయడమే ముఖ్య ఉద్దేశంగా మన బడి…మన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. బడి పరిసరాలు పచ్చదనంతో నిండాలని, బడి పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతగా భావించాలని ఆయన కోరారు.విద్య అనేది విజ్ఞానంతో పాటు సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత పెరిగేలా ఉండాలన్నారు.

వివక్షత లేని సమాజం ఏర్పాటులో మనందరం భాగస్వాములు అవుదామనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రార్థన సమయంలో మన పాఠశాల.. మన ఆత్మగౌరవం అనే ప్రతిజ్ఞ విద్యార్థులు, ఉపాధ్యాయులతో చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల కార్యదర్శి రమేష్, డివిజన్ కార్యదర్శి శంకర్ గౌడ్, ఆనంద్, మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad