Sunday, December 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసంక్రాంతి బరిలో 'మన శంకర వర ప్రసాద్‌ గారు'

సంక్రాంతి బరిలో ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’

- Advertisement -

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, అర్చన సమర్పిస్తున్నారు. చిత్ర నిర్మాతలు శనివారం సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఓ గ్రాండ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

ఈసినిమాలో చిరుతో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు వెంకటేష్‌. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ సినిమాలోని ఆయన పోషిస్తున్న పాత్ర తాలూకా పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ సినిమా షూటింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఏడు రోజుల లాంగ్‌ వీకెండ్‌ బెనిఫిట్‌ని ఈ సినిమా పొందుతుందనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -